రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం: సీఎం

79చూసినవారు
రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధం: సీఎం
తెలంగాణలోని రైతుల కోసం ప్రజా ప్రభుత్వం రూ. 54వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్‌ వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ రైతు పండుగ సభలో సీఎం మాట్లాడుతూ.. 'రైతుల కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. నవంబర్‌ 29వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రజా ప్రభుత్వం కోసం ఉత్సాహంగా ఓట్లు వేసి నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దింపారు. పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పారుతున్నా జిల్లా ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు' అని అన్నారు.

సంబంధిత పోస్ట్