స్కూటీపై వెళ్తూ రీల్స్... ఇద్దరు బాలురు మృతి

62చూసినవారు
స్కూటీపై వెళ్తూ రీల్స్... ఇద్దరు బాలురు మృతి
స్కూటీపై వెళ్తూ రీల్స్‌ చేసి ఘోర ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ సూరారం కాలనీ భవానీనగర్‌కు చెందిన సంధ్య ఉదయ్‌(17), శివదీక్షిత్‌(17), మరో బాలుడు(17) కలిసి స్నేహితుడి పుట్టినరోజు కావడంతో శుక్రవారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం స్కూటీపై మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్దకు బయలుదేరారు. సెల్ ఫోన్ లో రీల్స్ చేస్తూ కూకట్ పల్లి సమీపంలో ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టారు. దీంతో ఇద్దరు బాలురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో బాలుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్