హైదరాబాద్ నగరవ్యాప్తంగా చూస్తే.. జూబ్లీహిల్స్ నివాసిత ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ద కాలుష్యం నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. శబ్ద తీవ్రత 70 డెసిబుల్స్ దాటితే చెవుడు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటిది జూబ్లీహిల్స్ ప్రాంతంలో అత్యధికంగా 76.25 -78.52 డెసిబుల్స్‌గా నమోదైందని ఇటీవల పీసీబీ విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే.. ఈ ప్రాంతంలో నివసిస్తే చెవుడు రావటం మాత్రం గ్యారంటీ అని నిపుణులు చెబుతున్నారు.