విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రూ.261 కోట్లు విద్యుత్ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేయడంతో తెలంగాణ డిస్కమ్‌లను విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని ఎన్‌ఎల్‌డీసీని ఆదేశించింది.