తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్'

67చూసినవారు
తీవ్ర తుపానుగా బలపడిన ‘రెమాల్'
తీవ్ర తుపానుగా బలపడిన 'రెమాల్' అదివారం అర్ధరాత్రి వరకు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. తుపాను ప్రభావంతో గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతోనూ గాలులు వీచే అవకాశముందని తెలిపింది. ముందస్తు చర్యల్లో భాగంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున NDRF సిబ్బందిని రంగంలోకి దించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్