మణిపూర్‌లో నిర్వాసితుల నిరసన

61చూసినవారు
మణిపూర్‌లో నిర్వాసితుల నిరసన
తమ ఇళ్లకు తిరిగి వెళ్తామంటూ మణిపూర్‌లోని నిర్వాసితులు నిరసన చేపట్టారు. మైతీ, కొండ ప్రాంతాలకు చెందిన కుకీల మధ్య 2023 మేలో జాతి హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో మోరేలోని ఇళ్ల నుంచి పారిపోయిన నిర్వాసితులు ఇంఫాల్‌లోని అకంపత్‌లో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాల్లో నివసిస్తున్నారు. కాగా, గురువారం వారంతా బ్యానర్లు, ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్, రబ్బరు బుల్లెట్స్‌ను పోలీసులు ప్రయోగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్