AP: ఏపీ డీజీపీ తిరుమలరావు రిటైర్మెంట్ ఫేర్వెల్ పరేడ్ లో భావోద్వేగానికి గురయ్యారు. మంగళగిరిలోని పోలీస్ గ్రౌండ్లో తిరుమలరావు పదవీ విరమణ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వీసులో చేరినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని, ఇకపై యూనిఫామ్ ఉండదంటేనే భావోద్వేగంగా ఉందన్నారు. ఉద్యోగ జీవితంలో ఎంతో మంది తనకు సహకరించారని గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ పోలీసింగ్ ను టెక్నాలజీ వైపు నడిపించి ప్రొఫెషనలిజం తీసుకొచ్చామని పేర్కొన్నారు.