సీఎం పదవి నుంచి రేవంత్ వైదొలగాలి: DK అరుణ

73చూసినవారు
సీఎం పదవి నుంచి రేవంత్ వైదొలగాలి: DK అరుణ
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుస్తామని రేవంత్‌ అన్నారని..కానీ ఇప్పుడేమైందని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఎన్నికైన BJP ఎంపీలమంతా 7న దిల్లీకి వెళ్తామని చెప్పారు. బీజేపీని అడ్డుకోవడం కోసం రిజర్వేషన్లు తీసివేస్తారని.. రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసిన ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని.. మహబూబ్ నగర్ లో ఓడిపోయినందుకు సీఎం పదవి నుంచి రేవంత్ వైదొలగాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్