బ్రిటన్‌లో జూలై 29న కత్తిపోటుతో ముగ్గురు బాలికలు మరణించడంతో మొదలైన అల్లర్లు దేశవ్యాప్తంగా విస్తరించాయి. గత రెండు వారాలుగా యూకేలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ అల్లర్లతో సంబంధం ఉన్న వెయ్యి మందిని అరెస్ట్ చేసినట్లు నేషనల్ పోలీస్ చీఫ్ కౌన్సిల్ తెలిపింది. సుమారు 575 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించింది.