కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. తనకు వచ్చిన నేషనల్ అవార్డును రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్‌కి, కన్నడ ఆడియన్స్‌కి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. హోంబలే ఫిల్మ్స్ 'కాంతార'ను నిర్మించగా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.