మంచు మనోజ్- మౌనిక దంపతులు సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆళ్లగడ్డ వేదికగా తమ పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా వివాదంతో తాము రాజకీయంగా బలపడాలని వీరు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మౌనిక తల్లి.. శోభ నాగిరెడ్డి జయంతి వేడుకల్లో రేపు(సోమవారం) వీళ్లు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో వీరు రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.