టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. మరో రెండు సిక్సులు కొడితే అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలుస్తారు. ప్రస్తుతం 331 సిక్సులతో క్రిస్ గేల్ రెండోస్థానంలో ఉండగా రోహిత్ ఖాతాలో 330 సిక్సులున్నాయి. రేపు కొలంబోలో జరిగే మూడో వన్డేలో రోహిత్ ఈ రికార్డును సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ జాబితాలో షాహిద్ ఆఫ్రిది(351) అగ్రస్థానంలో ఉన్నారు.