భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. కమిన్స్ వేసిన 4.1 ఓవర్‌కు రోహిత్ భారీ సిక్స్ బాదాడు. ఇది 100 మీటర్లు వెళ్లింది. ఈ సిక్స్‌తో రోహిత్ అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడుతున్న హిట్ మ్యాన్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50* పరుగులు పూర్తి చేసుకున్నాడు.