రోహిత్ శర్మ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను సాధించింది. దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఫైనల్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడారు. 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ గెలిచాక తన భార్య రితిక, పిల్లలతో కలిసి మైదానంలో సంబరాలు చేసుకున్నారు.