కోల్గేట్ కు ఆదాయపు పన్ను విభాగం షాక్ ఇచ్చింది. 2021, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కోల్గేట్ ధరల బదిలీ సంబంధిత విషయంలో జరిగిన అవకతవకలపై రూ.248.74 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను కంపెనీ అందుకుంది. అయితే, దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందు సవాలు చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది. కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో కోల్గేట్ రూ. 5,644 కోట్ల విలువైన విక్రయాలను నమోదు చేసింది.