TG: కిలో రూ.3.. కంటతడి పెడుతున్న టమాటా రైతన్న

60చూసినవారు
TG: కిలో రూ.3.. కంటతడి పెడుతున్న టమాటా రైతన్న
తెలంగాణలో టమాటా రైతన్నలు గిట్టుబాటు ధరలు లేక, కిలో టమాటా రూ.3కే అమ్ముకోవాల్సిన పరిస్థితి రావడంతో కంటతడి పెడుతున్నారు. రంగారెడ్డి (D) కొందుర్గ్ (M) రైతు సర్సింహులు 56 టమాటా పెట్టెలు (ఒక్కోదాంట్లో 30కిలోలు) అమ్మెందుకు MBNR రైతుబజారుకు తీసుకెళ్లారు. 39పెట్టెలకు దళారులు రూ.3,500 చెల్లించారు. మిగతావి కొనకపోవడంతో రెక్కల కష్టం గాలిలో కలిసిపోయిందని ఆవేదన చెందుతూ టమాటాలను రోడ్డుపక్కన పారబోశాడు. మార్కెట్‌లో కిలో టమాటా రూ.10-రూ.20 వరకు ఉంది.

సంబంధిత పోస్ట్