ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటరోలా 'జి' సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. మెటో జీ35 5జీ పేరిట దీన్ని ఆవిష్కరించింది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 5,000mAh బ్యాటరీతో ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేటు, 240Hz టచ్ సాంప్లింగ్ రేటు ఇచ్చారు. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.