ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

69చూసినవారు
ఆర్టీసీ బస్సు-కారు ఢీ.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
TG: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన చివ్వెంల మండలం బీబీగూడెం వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు-కారు ఢీకొని దంపతులతో పాటు వారి ఎనిమిదేళ్ల కుమార్తె మృతిచెందారు. మృతులను గడ్డం రవీందర్‌, రేణుక, రితికగా గుర్తించారు. మృతులను మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం కంఠకాయపాలెం వాసులుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్