ఆర్టీసీ గమ్యం యాప్‌ సేవలు అంతంతేగా!

81చూసినవారు
ఆర్టీసీ గమ్యం యాప్‌ సేవలు అంతంతేగా!
TG : బస్టాప్‏లు, సమయం, బస్సుల వివరాలు తెలిపే గమ్యం యాప్‌ పనిచేయడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నా RTC అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొదట మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను యాప్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. త్వరలో ఆర్డినరీ బస్సులను యాప్‌లో చూసుకునే సౌకర్యం కల్పిస్తామని అధికారులు చెప్పినా ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా యాప్‌ సేవలను మెరుగుపర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్