‘తాడాసనం’ వీడియో షేర్ చేసిన ప్రధాని (video)

66చూసినవారు
యోగాతో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామన్న భావన కలుగుతుందని.. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతామని ప్రధాని మోదీ చాలాసార్లు చెప్పారు. ఇక త్వరలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ఎక్స్‌ ఖాతాలో ఆయన ఓ వీడియోను షేర్‌ చేశారు. ఆ వీడియో క్లిప్‌లో తాడాసనం గురించి వివరణ ఉంది. మోదీని పోలిన గ్రాఫిక్‌ ఇమేజ్‌ ఆ ఆసనం ఎలా వేయాలో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలు చిత్రాల రూపంలో మనం చూడొచ్చు.

సంబంధిత పోస్ట్