BREAKING: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృతి

76చూసినవారు
BREAKING: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ మృతి
రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ( 47) కన్నుమూశారు. అలెక్సీ నవాల్నీ గత కొన్నేళ్లుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆయన మరణించినట్లు జైలు సిబ్బంది ఓ వార్తా సంస్థ ద్వారా తెలిపారు. వివరాల ప్రకారం.. శుక్రవారం 4 గంటలకు జైలులో, అలెక్సీ నవాల్నీ కొద్దిసేపు నడిచిన తర్వాత అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఇది గమనించిన అధికారులు, వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్