పారిస్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన రెజ్లర్ అమన్ సెహ్రావత్ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించారు. 'భారత్ తరఫున అత్యంత చిన్న వయస్సులో పతకం గెలిచిన అమన్ సెహ్రవా త్ కు కంగ్రాట్యు లేషన్స్. ఇది మీ విజయం మాత్రమే కాదు, మొత్తం భారత రెజ్లింగ్‌ది. ప్రతి భారతీయుడూ మీ విజయం పట్ల గర్విస్తున్నాడు. స్వర్గం నుంచి మీ తల్లిదండ్రులు నిన్ను చూస్తూ గర్వపడుతుంటారు' అని ట్వీట్ చేశారు.