PM ‘మన్ కీ బాత్’ స్ఫూర్తితో కుంభమేళాలో ఇవాళ పదివేల మంది సాధువులతో ‘సాధువో కీ మన్ కీ బాత్’ నిర్వహించనున్నారు. హరిధామ్ సనాతన్ సేవాట్రస్టులో మధ్యాహ్నం 2.00 నుంచి సాయంత్రం 5.00 గంటల దాకా ఈ చర్చ ఉంటుంది. అన్ని అఖాడాలకు చెందిన ప్రముఖ సాధువులు ఇందులో పాల్గొంటారని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. కార్యక్రమంలో సాధువులు ఎదుర్కొంటున్న సమస్యలు, గోహత్యపై నిషేధం వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి.