టిక్‌టాక్‌ను అమ్మ‌డం లేదు: చైనా కంపెనీ

78చూసినవారు
టిక్‌టాక్‌ను అమ్మ‌డం లేదు: చైనా కంపెనీ
టిక్ టాక్ పాపులర్ వీడియో యాప్ అన్న విషయం తెలిసిందే. అయితే ఆ చైనీస్ యాప్‌పై అమెరికాలో ఓ చ‌ట్టాన్ని చేశారు. ఆ యాప్‌ను అమ్మివేయాల‌ని లేదంటే బ్యాన్ చేస్తామ‌ని ఇటీవ‌ల అమెరికా హెచ్చ‌రించింది. ఆ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో టిక్‌టాక్ చైనీస్ కంపెనీ బైట్‌డ్యాన్స్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. టిక్‌టాక్‌ను విక్రయించే ఉద్దేశం లేదని కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని బైట్‌డాన్స్ కంపెనీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.

సంబంధిత పోస్ట్