రాయికోడ్: ఆటో బోల్తా పడి యువకుడు మృతి

83చూసినవారు
రాయికోడ్: ఆటో బోల్తా పడి యువకుడు మృతి
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని శంషాధిన్ పూర్ గ్రామ శివారులో ఆటో బోల్తాపతి యువకుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ నారాయణ కథనం ప్రకారం బీరద్దార్ పండరి, వరవాటి శివాజీ పాత సంచులను తీసుకొని రాయికోడ్ గ్రామంలో దించి, తిరుగు ప్రయాణమయ్యారు. శివాజీ ఆటోను అతివేగంగా నడుపుతూ శంశోద్దీన్ పూర్ గ్రామ శివారులో ఆటోను బోల్తా వేశాడు. పండరికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్