స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారెంటీల సంక్షేమ పథకాల సర్వే పేరుతో ఆశ చూపుతోందని జిల్లా యువత కార్యదర్శి నాయికోటీ భాస్కర్ ఆరోపించారు. టేక్మాల్ మండల కేంద్రంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను నెరవేరుస్తామని ప్రకటించారు. కానీ ఇంత వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.