సీ2 తెలంగాణ న్యూస్, వాస్తవ తెలంగాణ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను టేక్మాల్ తహశీల్దార్ తులసిరామ్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ఛానల్, పత్రిక ఎల్లప్పుడూ పేద ప్రజల పక్షాన పోరాడుతూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి దోహదపడతాయని వారు కొనియాడారు. ఇలాగే ఛానల్, పత్రిక భవిష్యత్ లో ప్రజలకు మరింత చేరువై పేద ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షించారు.