రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై దాడికి నిరసనగా ఈనెల 20వ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ అదివారం తెలిపారు. ప్రధానోపాధ్యాయుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపాలని కోరారు.