గుమ్మడిదల మండలంలో వంద పడకల ఆసుపత్రికి మంత్రి గ్రీన్ సిగ్నల్
గుమ్మడిదల మండలంలో 100 పడకల ఆసుపత్రికి మంత్రి రాజనర్సింహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శుక్రవారం మండల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్ మండలంలోని పలు సమస్యలపై మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వివరించారు. మండలంలోని నిరుపేద ప్రజలకు పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల కొరకు 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.