టాలీవుడ్ నటి అభినయ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా తనకు కాబోయే వరుడిని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అతని పేరు సన్నీవర్మ అని తెలిపింది. అంతే కాకుండా మార్చి 9న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది. సన్నీ వర్మ ప్రస్తుతం హైదరాబాద్ లోనే మల్టీ నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది.