పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఆర్డీవో

56చూసినవారు
పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: ఆర్డీవో
పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నారాయణఖేడ్ ఆర్డిఓ అశోకచక్రవర్తి సూచించారు. బుధవారం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో శాంతి సమావేశం నిర్వహించారు. మండపాలను రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడే విధంగా ఏర్పాటు చేయవద్దన్నారు. నిబంధన ప్రకారం ఏర్పాటు చేయాలని సూచించారు. డీఎస్పీ వెంకటరెడ్డి, సీఐ శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ జగ్జీవన్, తహసిల్దార్ భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్