ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు మరువలేనివని గుఱ్ఱపు మచ్చేందర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్బంగా నారాయణఖేడ్ పట్టణంలోని 4వ వార్డులో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు టీం సభ్యులు మారుతి, బాషిత్, రవీందర్ నాయక్, పండరి యాదవ్, సత్యపాల్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, శ్రీకాంత్, విట్టల్, పండరి తదితరులు ఉన్నారు.