శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో కడ్పల్ పాఠశాల విద్యార్థులు

79చూసినవారు
శ్రీకృష్ణ, గోపికల వేషధారణలో కడ్పల్ పాఠశాల విద్యార్థులు
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామ ఎంపిపిఎస్ ప్రాథమిక పాఠశాలలో శనివారం శ్రీ కృష్ణ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలు చేపట్టి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల విశిష్టతను విద్యార్థులకు స్థానిక ఉపాధ్యాయులు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బన్సీలాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్