సంగారెడ్డి జిల్లా కంది మండల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ -1 కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన అంబటి విట్టల్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సంగారెడ్డి పీఎస్ఆర్ గార్డెన్ లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. ఈ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని శనివారం అన్నారు. ఎమ్మెల్యే, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.