సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రం నుంచి మండల బీఆర్‌ఎస్ నాయకులు శుక్రవారం దీక్ష దివస్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి స్మరించుకొని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణ, రమేష్ పాటిల్, నాయకులు విశ్వనాధ్, సంజీవ్ పాటిల్, సిద్దు పాటిల్ పాటిల్, బస్వరాజ్ పాటిల్, సచిన్ పాటిల్, పవన్ పాటిల్, తదితరులు ఉన్నారు.