శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో నగేష్ షెట్కార్

74చూసినవారు
శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో నగేష్ షెట్కార్
నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ కుమార్ షెట్కార్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాధాకృష్ణ మందిర ఆలయ కమిటీ సభ్యులు నందు షెట్కార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్