నారాయణఖేడ్ నియోజక వర్గంలోని పెద్దశంకరంపేట మండలం కొప్పోలు శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాసం సోమవారం ఉదయం ఉమా సంగమేశ్వర స్వామికి అర్చకులు సంగప్ప, జగదీష్ స్వామి అధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు జరిపించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.