తడ్కల్ లో ముత్యాల పోచమ్మ బోనాలు

82చూసినవారు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ ఆషాడం ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. అదివారం ఆషాడ మాసం  పురస్కరించుకొని గ్రామంలో గ్రామ దేవతలకు ముత్యాల పోచమ్మ బోనాల సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి మట్టికుండలో నైవేద్యం తీసుకొని డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, శివసతుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ముత్యాల పోచమ్మ, ముత్యాలమ్మకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్