వామ్మో బాబోయ్... కడ్పల్ శివారులో చిరుత పులి

83చూసినవారు
వామ్మో బాబోయ్... కడ్పల్ శివారులో చిరుత పులి
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ శివారులో మంగళవారం చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రోజు మాదిరిగానే కడ్పల్ గ్రామానికి చెందిన రైతు బాసిరెడ్డి గారి భద్రారెడ్డి అనే రైతు శివారులోని శానూర్ ఇమామ్ దర్గా సమీపంలో తన పొలానికి వెళ్తుండగా పులి కనిపించిందని ఆయన తెలిపారు. దారిలో పులి నడిచిన పాదముద్రలు స్పష్టంగా కనిపించాయని తన సెల్ ఫోన్లో ఫోటోలను సైతం బంధించి చూయించారు.

సంబంధిత పోస్ట్