పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పారిశుధ్య కార్మికుల పనితీరును శనివారం ఉదయం 5: 00 గంటలకు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కాలనీలలో ఆకస్మిక తనిఖీ చేశారు. అందరూ క్రమం తప్పకుండా నిర్ణయించిన సమయానికి విధులకు హాజరు కావాలని, తమకు కేటాయించిన పరిధిలో చెత్తను క్లీన్ చేయాలని, కాలనీవాసుల నుండి తనకు ఫిర్యాదులు రాకుండా చూడాలని కార్పోరేటర్ పారిశుద్ధ్య కార్మికులను ఆదేశించారు.