బొల్లారం మున్సిపల్ పరిధిలోని వైయస్సార్ కాలనీలో సర్వే నంబర్ 284 పార్కు స్థలంలో గుర్తు తెలియని వ్యక్తి నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. పార్కు స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.