సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండలంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. గడ్డపోతారం, మంత్రి కుంట, వావిలాల, ఊట్ల, కొడకంచి, మాదారం తదితర గ్రామాలలో బుధవారం ఉదయం 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమ శాతం 63% గా ఉంది. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి ఎక్కువగా ఉంది. చలితో వృద్ధులు, గర్భిణీలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.