సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొల్లారం మున్సిపల్ కౌన్సిలర్ చంద్ర రెడ్డి బుధవారం మహాత్మా గాంధీ 155'వ జయంతి వేడుకల సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని బీ. సీ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్ముడి విగ్రహానికి స్థానికులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.