
ENG vs IND: నాలుగో రోజు ముగిసిన ఆట.. ఇంగ్లండ్ స్కోరు 21/0
లీడ్స్‌లో ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. 371 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ (9*), జాక్ క్రాలే (12*) ఉన్నారు. ఆఖరి రోజు ఇంగ్లండ్ విజయానికి 350 పరుగులు అవసరం కాగా.. భారత్ 10 వికెట్లు పడగొట్టాలి. ఇప్పుడు ఇక గెలుపు, ఓటములు టీమిండియా బౌలర్ల చేతుల్లోనే ఉన్నాయి.