లోక్ సభ ఎన్నికల్లో ఈసారి సినీగ్లామర్ బాగా పెరిగింది. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకూ డజనుకుపైగా సినీతారలు ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే పలువురు సీనియర్ నటులు ఎంపీలుగా ఎన్నికై మరోసారి రంగంలోకి దిగుతుండగా.. తాజాగా మరికొందరు రాజకీయాల్లో తమ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో నటీనటులు బీజేపీ పార్టీ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు.