లోక్ సభ ఎన్నిక‌ల బ‌రిలో రాధిక

1867చూసినవారు
లోక్ సభ ఎన్నిక‌ల బ‌రిలో రాధిక
దక్షిణాదిలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న రాధికా శరత్ కుమార్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ ప్ర‌క‌టించిన నాలుగో జాబితాలో న‌టి రాధిక స్థానం ద‌క్కించుకున్నారు. గతంలో రాధిక భ‌ర్త శరత్‌కుమార్‌ ఆల్‌ ఇండియా సమత్వ మక్కల్‌ కచ్చి పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని ఇటీవల బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం రాధిక తమిళనాడులోని విరుధ్‌నగర్‌ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.