రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్

57చూసినవారు
రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ సీజ్
హైదరాబాద్‌లో డ్రగ్స్‌, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం పక్కా సమాచారంతో ఎల్బీనగర్‌ SOT, లా అండ్ ఆర్డర్‌ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ చేపట్టి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. నలుగురు డ్రగ్‌ పెడ్లర్స్‌, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24గ్రా. హెరాయిన్, 5కిలోల పోపీస్ట్రా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్