చెరువు కట్టు కాలువ మరమత్తులు చేపట్టాలని రైతు రాజు గౌడ్ పేర్కొన్నారు. హత్నూర మండలం మల్కాపుర్ చెరువు కట్టు కాలువలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నస్తీపూర్ శివారులోని మల్కాపుర్ గ్రామ చెరువు కట్టు కాలువలు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీంతో పొలాల్లోకి సాగు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు స్పందించి కట్టు కాలువలు మరమత్తులు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.