సంగారెడ్డి జిల్లాజిన్నారం మండలంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతల తగ్గుతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో సంగారెడ్డి జిల్లాకి వాతావరణ శాఖ కేంద్రం హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఉదయం 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 82%గా ఉంది, పొగ మంచుతో వాహనదారులు హెడ్ లైట్లు వేసి మరి వాహనాలను నడిపారు. ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.