రాయికోడ్ ప్రాంత ప్రజలకు ఎస్ఐ సూచన
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పరిధిలో కుస్నూర్ గ్రామ శివారులో రాయికోడ్ చౌరస్తా నుండి రాఘపూర్ వెళ్లే దారిలో కుస్నూర్ గ్రామ శివారులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులో నీరు రావడంతో రహదారి మునిగిపోయింది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండలం ఎస్ఐ కిష్టయ్య ఒక ప్రకటనలో తెలిపారు.